Shruti Haasan: తమిళ సినిమాల ద్వారా కెరీర్ స్టార్ చేసిన శృతి హాసన్.. సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ.. పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించుకున్న తర్వాత అమ్మడి కెరీర్ ఓ రేంజ్ కి వెళ్లిందని చెప్పాలి. ఇటు హీరోయిన్ గా అటు సింగర్ గా రానిస్తూ అనతి కాలంలోనే అభిమానుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ కూతురుగా కంటే శృతిహాసన్ అనగానే ఎక్కువ మంది గుర్తుపడే స్థాయికి ఎదిగారామె.
Read Also: Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య
శృతిహాసన్ ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకొని ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. గతేడాది తెలుగులో రవితేజతో క్రాక్, పవన్ కల్యాణ్ సరసన వకీల్ సాబ్ మూవీలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా గతేడాది సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ సారి కూడా ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలతో సంక్రాంతి బరిలో ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండింట్లో ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లే కావడం గమనార్హం. ఓ పక్క చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, మరొకరు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read Also: Kaikala Satyanarana : నేడు అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
ఇక ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో బాలకృష్ణ తో కలిసి చేస్తున్న వీరసింహారెడ్డి మూవీలోని ఒక సాంగ్ చేస్తున్నారు శృతిహాసన్. ఈ సందర్భంగా మా ఊరు వ్యక్తి అయిన ఆస్కార్ నామిటెడ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో వర్క్ చేయడం వేరే లెవెల్ అంటూ సరదాగా తన ఇన్ స్టాగ్రామ్లో శృతి హాసన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.