Site icon NTV Telugu

వావ్ Shreyas Iyer.. రిలే క్యాచ్ అదరగొట్టేశావ్.. వీడియో వైరల్.!

Shreyas Iyer

Shreyas Iyer

ముంబైలో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలే క్యాచ్ తో అబ్బురపరిచాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్‌ను స్కోర్ పెంచే ప్రయత్నంలో 18వ ఓవర్‌ లో భారీ షాట్ ఆడాడు. లాంగ్-ఆన్ దిశగా వెళ్లిన ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా జంప్ చేసి ఆపాడు.

MI vs PBKS: సెంచరీతో డికాక్ వీరవిహారం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం.!

హార్దిక్ కొట్టిన బంతి సిక్స్‌గా వెళ్లేలా కనిపించినా, ఆ సమయంలో మాత్రం అయ్యర్ సుమారు 5-6 అడుగుల ఎత్తుకు ఎగిరి బంతిని ఆపి, వెంటనే దాన్ని లోపలికి త్రో చేశాడు. అంతే అదే సమయానికి దగ్గరికి వచ్చిన జేవియర్ బార్ట్‌లెట్‌ ఆ క్యాచ్‌ ను సక్సెస్‌ఫుల్‌ గా పూర్తి చేశాడు. ఈ రిలే క్యాచ్‌తో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఈ అద్భుత క్యాచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ వాంఖెడే స్టేడియంలోని ప్రేక్షకులను టీజ్ చేశాడు. అతని రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిలే క్యాచ్ మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.

LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇందులో ఈ సీజన్ లో మొదటిసారిగా బరిలోకి దిగిన ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. డికాక్ కేవలం 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Exit mobile version