Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది.
ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్‌ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు. వీరిలో శెడ్గేకు ఇంకా ఆడే అవకాశం రాలేదు. ప్రిన్స్ యాదవ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. మిగిలిన జట్టు అంతా ఎంతో అనుభవజ్ఞులతో కూడినదే.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
ఆటగాళ్ల అనుభవాన్ని చూస్తే.. అక్షర్ పటేల్ 100 మ్యాచ్‌లు, అర్ష్‌దీప్ సింగ్ 90 మ్యాచ్‌లు, శివమ్ దూబే 70 మ్యాచ్‌లు, సంజూ శాంసన్ 65 మ్యాచ్‌లు, వాషింగ్టన్ సుందర్ 62 మ్యాచ్‌లు, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) 57 మ్యాచ్‌లు, తిలక్ వర్మ 55 మ్యాచ్‌లు, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చెరి 50 కి పైగా మ్యాచ్‌లు, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ దాదాపు 50 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కొందరు సీనియర్లు ఈ సిరీస్‌లో లేనప్పటికీ, జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి వారు కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారే.
ఒక తరం నుండి మరో తరానికి మారడాన్ని ‘ట్రాన్సిషన్’ అంటారు. కానీ ఇక్కడ ఆడుతున్న ప్లేయింగ్ XI లో మెజారిటీ ఆటగాళ్లు పాతవారే. సీనియర్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే సిరీస్ ఓటమికి ప్రధాన కారణం. కాబట్టి, ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి “జట్టు మార్పుల దశలో ఉంది” అని శ్రేయస్ అయ్యర్ చెప్పిన మాటలు కేవలం సాకులుగానే కనిపిస్తున్నాయి తప్ప, అందులో ఎలాంటి నిజం లేదు. యువ ఆటగాళ్లను నెపంగా చూపి సీనియర్లు తమ వైఫల్యాలను దాచలేరని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?