BCCI Central Contract 2025: ఆ ఇద్దరికి మళ్లీ చోటు.. తెలుగు కుర్రాడికి ఛాన్స్!
- బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితా ప్రకటన
- శ్రేయస్, ఇషాన్‌కు మళ్లీ చోటు
- తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి ఛాన్స్
- గ్రేడ్‌ల శాలరీ జాబితా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024-2025 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు ఇటీవల అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి బీసీసీఐ కాంట్రాక్టులో ఛాన్స్ ఇచ్చింది.
A+ గ్రేడ్‌లో నలుగురు, A గ్రేడ్‌లో ఆరుగురు, బి గ్రేడ్‌లో ఐదుగురు, సి గ్రేడ్‌లో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ స్టార్స్ నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించారు. వీరందరూ సి గ్రేడ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ బి గ్రేడ్ నుండి A గ్రేడ్‌కు పదోన్నతి పొందాడు. A+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను బీసీసీఐ వేతనంగా ఇవ్వనుంది.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
A గ్రేడ్‌లో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరందరూ ఏడాదికి రూ.5 కోట్లు వేతనంగా పొందనున్నారు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బి గ్రేడ్‌లో కాంట్రాక్ట్ దక్కింది. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌కు బి గ్రేడ్‌లో ఛాన్స్ వచ్చింది. వీరికి ఏడాదికి రూ.3 కోట్ల వేతనం వస్తుంది. యువ క్రికెటర్లకు సి గ్రేడ్‌లో చోటు దక్కింది. ఈ గ్రేడ్‌లో ఉన్న ఏడాదికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లించనుంది.
గ్రేడ్ A+:
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
జస్ప్రీత్ బుమ్రా
రవీంద్ర జడేజా
గ్రేడ్ A:
మహ్మద్ సిరాజ్
కేఎల్ రాహుల్
శుభమాన్ గిల్
హార్దిక్ పాండ్యా
మహ్మద్ షమీ
రిషబ్ పంత్
గ్రేడ్ బి:
సూర్యకుమార్ యాదవ్
కుల్దీప్ యాదవ్
అక్షర్ పటేల్
యశస్వి జైస్వాల్
శ్రేయాస్ అయ్యర్
గ్రేడ్ సి:
రింకూ సింగ్
తిలక్ వర్మ
రుతురాజ్ గైక్వాడ్
శివం దూబే
రవి బిష్ణోయ్
వాషింగ్టన్ సుందర్
ముఖేష్ కుమార్
సంజు శాంసన్
అర్ష్‌దీప్ సింగ్
ప్రసిద్ కృష్ణ
రజత్ పాటిదార్
ధృవ్ జురెల్
సర్ఫరాజ్ ఖాన్
నితీష్ కుమార్ రెడ్డి
ఇషాన్ కిషన్
అభిషేక్ శర్మ
ఆకాష్ దీప్
వరుణ్ చక్రవర్తి
హర్షిత్ రాణా
గ్రేడ్‌ల శాలరీ జాబితా:
గ్రేడ్ A+: సంవత్సరానికి రూ. 7 కోట్లు
గ్రేడ్ A: సంవత్సరానికి రూ. 5 కోట్లు
గ్రేడ్ B: సంవత్సరానికి రూ. 3 కోట్లు
గ్రేడ్ C: సంవత్సరానికి రూ. 1 కోటి
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!