ప్రజలను మోసం చేసేందుకు మోసగాళ్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. సైబర్ మోసగాళ్ల లాగానే యాత్రల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు మాయగాళ్లు.. తాజాగా.. యాత్రల పేరిట మోసం చేసిన ఘటన ఉప్పల్లో బయటపడింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ఆఫర్స్ ఇచ్చి డబ్బులు దండుకుంటుంది. జనాలకు ఆఫర్లు అంటూ ఎర చూపిస్తూ కోట్లల్లో వసూల్లు చేస్తున్నాడు శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వాహకుడు భారత్ కుమార్..
Read Also: Shivraj Chouhan: జార్ఖండ్‌లో ఎన్ఆర్‌సీ అమలు చేసి, బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని ఏరేస్తాం..
మానససరోవరం, ఇతర టూర్స్ పేరిట శ్రీ గాయత్రీ ట్రావెల్స్ గత మూడేళ్ళ నుండి భారీగా డబ్బులు వసూళ్లు చేసింది. అయితే.. రెండేళ్ల నుండి కరోనా పేరు చెప్పుకుంటూ నిర్వాహకుడు తప్పించుకుంటున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, నమ్మబలిక మాటలు చెబుతూ రేపు మాపు టూర్ అంటూ బాధితులని మోసం చేశాడు నిర్వాహకుడు.. బాధితులు ఒక్కొక్కరి నుండి రెండు నుండి మూడు లక్షల రూపాయల వసూల్లు చేశాడు. యాత్రలకు వెళ్తామన్న ఆశతో దాదాపు 150మంది పైగా బాధితులు నిర్వాహకుడికి డబ్బులిచ్చారు. ఈ క్రమంలో.. తమను యాత్రల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడని రామంతాపూర్ కు చెందిన ప్రియా రెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో.. నిర్వాహకుడు భారత్ కుమార్ శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం… అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై బాధితులు ముందుకొస్తున్న నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Team India: ఎల్లుండి క్రికెట్ అభిమానులకు స్పెషల్ డే.. ఎందుకో తెలుసా..?