Uttarpradesh : దారుణంగా కొట్టిన స్టూడెంట్.. ఐసీయూలో చేరిన టీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో ఏడో తరగతి విద్యార్థి తన టీచర్‌ను కొట్టి మరీ కొట్టి ఆస్పత్రిలో చేర్పించాడు. ఇప్పుడు ఆ టీచర్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. సోన్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్‌లో అందరి ముందు టీచర్.. ఆ విద్యార్థిని రెండు సార్లు చెప్పుతో కొట్టాడు. ఈ విషయం విద్యార్థి అవమానంగా భావించాడు. దీంతో పాఠశాల అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడిని కొట్టాడు. కాకందు గ్రామానికి చెందిన సునీల్ కుమార్ గుప్తా మోహరానియా గ్రామంలో టీచర్ గా పనిచేస్తున్నారు. గురువారం 7వ తరగతి విద్యార్థి ఫర్మాన్ అలీ ఏదో తప్పు చేసినందుకు ఉపాధ్యాయుడు రెండుసార్లు చెప్పుతో కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఫర్మాన్ పాఠశాల అయిపోయిన తర్వాత టీచర్ కోసం బయట వేచి ఉన్నాడు. ఉపాధ్యాయుడు సునీల్ తన ఇంటికి వెళ్తుండగా ఫర్మాన్ అతనిని అనుసరించాడు.
Read Also:G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
Also Read
మార్గమధ్యంలో డికౌలి వంతెన సమీపంలో అతను కర్రతో ఉపాధ్యాయుడిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయాడు. అనంతరం విద్యార్థిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఉపాధ్యాయుడు అపస్మారక స్థితికి వచ్చే వరకు అతన్ని కొట్టాడు. అటుగా వెళ్తున్న వారు పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ ప్రాణాలను కాపాడారు. దీంతో విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడు. టీచర్ పరిస్థితి విషమంగా ఉండటంతో బహ్రైచ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం పోలీసులకు చేరడంతో వారు విద్యార్థిని పట్టుకుని విచారించారు. విద్యార్థి ఫర్మాన్ మాట్లాడుతూ- క్లాస్‌లో అందరి ముందు సర్ నన్ను రెండుసార్లు చెప్పుతో కొట్టాడు. అది నాకు నచ్చలేదు. అందరి ముందు నన్ను అవమానించారు. అందుకే టీచర్ మీద పగ తీర్చుకున్నాను అంతే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!