NTV Telugu Site icon

Shraddha Das: కట్టెల పొయ్యిపై తెగ కష్టపడిపోతున్న హీరోయిన్..

Shraddha Das Making Rotis

Shraddha Das Making Rotis

Shraddha Das Making Rotis in Maharashtra Photos are viral: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజిని క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ఒకరు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది. అయితే ప్రధాన హీరోయిన్గా నటించడంలో మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే వెండితెర పైన అందాల ఆరబోతకు అసలు వెనకడుగు వేయని ఈ అందాల భామ రాను రాను సినిమా అవకాశాలను తగ్గించుకుంది. ఇక ఏడాది పారిజాత పర్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ భామ మహారాష్ట్ర లో విజిట్ కోసం వెళ్ళినప్పుడు ఈ అమ్మడు ఓ పేదింటి మహిళా ఇంట్లోకి వెళ్లి కట్టెల పొయ్యి పై రొట్టెలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

YouTube: యూట్యూబ్‌కు అంతరాయం.. యూజర్ల ఆందోళన

ఇదివరకు జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోలు, అలాగే బికినీలతో ఉన్న ఫోటోలను షేర్ చేసే ఈ భామ తాజాగా కట్టెల పోయి రొట్టెలు చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆవిడ రొట్టెలు చేస్తున్న గాని తన గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించలేదు. ఓ నిరుపేద మహిళలకు చెందిన ఇంట్లో తానే స్వయంగా రొట్టెలు తయారుచేసి కాల్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. నిజానికి ఆవిడకు వంట చేయడం వచ్చో.. రాదో.. తెలియదు గాని.. ఫోటోలకు మాత్రం బాగానే ఫోజులు ఇచ్చిందంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఆవిడ చేసిన పనికి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఘటనలో శ్రద్ద దాస్ స్లీవ్ లెస్ లాంగ్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసి యూత్ మైమరిచిపోతున్నారు. మహారాష్ట్రలోని కోపాలలిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Show comments