Site icon NTV Telugu

Gun Fire: బీహార్లో కాల్పుల కలకలం.. కోర్టు ప్రాంగణంలో ఇద్దరు ఖైదీల కాల్చివేత

Bihar

Bihar

బీహార్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సమస్తిపూర్ సివిల్ కోర్టు ప్రాంగణం బుల్లెట్ల మోతతో మారుమోగింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులకు బహిరంగ సవాల్ విసిరి ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అండర్ ట్రయల్ ఖైదీలు ప్రభాత్ చౌదరి, ప్రభాత్ తివారీలను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం గందరగోళం నెలకొనగా.. ఇద్దరు ఖైదీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Game Changer Leaks : కల్తీ బియ్యం పట్టుకున్న రామ్ చరణ్.. వైరల్ అవుతున్న పిక్స్..

ఖైదీలలో ఒకరికి తొడపై కాల్పులు జరుపగా.. మరో ఖైదీ చేతికి బుల్లెట్ దిగింది. సమాచారం అందుకున్న డీఐయూ బృందంతో పాటు నగర్, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హెడ్ క్వార్టర్స్ డీఎస్పీ అమిత్ కుమార్, ఎస్పీ వినయ్ తివారీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి ఖైదీలను విచారించారు.

Read Also: Pizza 3 OTT: థియేటర్లలో విడుదలైన వారంలోనే ఓటీటీకి వచ్చేసిన ‘పిజ్జా 3’.. ఎక్కడ చూడాలంటే?

కొద్ది రోజుల క్రితం పేరుమోసిన మద్యం మాఫియా ప్రభాత్ చౌదరిని ఎస్టీఎఫ్ సహాయంతో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆరు నెలలు కష్టపడి జ్యుడీషియల్ కస్టడీలో జైలుకు పంపినట్లు ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతుందని.. అందుకోసమే అతన్ని కోర్టుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నలుగురు దుండగులు ప్రభాత్ చౌదరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సదరు డీఎస్పీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసి.. దుండగులను గుర్తించినట్లు వారు తెలిపారు.

Exit mobile version