Site icon NTV Telugu

Hyderabad: మలక్ పేటలో కాల్పుల కలకలం.. వాకింగ్ చేస్తున్న వారిపై కాల్పులు

Gun Fire

Gun Fire

మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట వాసి. కాల్పులకు కారణం భూ వివాదం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వాకర్స్ పై కాల్పులు జరపడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన పార్క్ లోని వారు. దుండగుల కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version