NTV Telugu Site icon

Shocking: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.. షాకింగ్ వీడియో చూడండి..

Viral News

Viral News

Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.

తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుది. ఈసారి ఓ పాము కారు బానెట్ కింద ఇంజిన్ లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఇది మామూలు సాదాసీదా పాము కాదు..6 అడుగుల కొండచిలువ కారు ముందు ఇంజిన్ లో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దేశరాజధానిలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: David Warner: డేవిడ్ వార్నర్ మరో రికార్డ్.. సచిన్, రోహిత్ను వెనక్కి నెట్టి..

దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కారులో ఇంజిన్ భాగంలో చుట్టుకొని ఉన్న భారీ కొండచిలువను చూడివచ్చు. అయితే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని కొండచిలువను రెస్క్యూ చేశారు. పోలీసులు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేశారు. కొండ చిలువను రక్షించేందుక కారు కింది భాగం నుంచి ఆపరేషన్ నిర్వహిచారు. అరగంట పాటు శ్రమించి పామును బయటకు తీశారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

Show comments