Site icon NTV Telugu

Shocking Viral Video: మహిళలు జాగ్రత్త.. సానిటరీ ప్యాడ్స్‌లో ‘లార్వా’.. వీడియో వైరల్

Shocking Viral Video

Shocking Viral Video

Shocking Viral Video: మహిళలకు ఋతుచక్రం రావడం అనేది దేవుడి సృష్టి. ఆ సమయంలో మహిళలు అనుభవించే బాధ చెప్పలేనిది. ఇది ఇలా ఉండగా ఋతుచక్రం సమయంలో మహిళలు తీసుకొనే జాగ్రత్తలలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ గురించి. అవును.. కాలక్రమేణా మహిళలు వీటికి అలవాటు పడిపోయారు. ఇక ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలు ఇందుకు సంబంధించి కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయి.

Maruti Suzuki Victoris: విడుదలై నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే రూ.15,000 ధర పెంపు..!

అయితే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ భద్రతపై ఆందోళన కలిగించే విషయం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా కలకలం రేపే ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అల్లీ డి (Allie D) అనే మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఆమె కొత్తగా కొనుగోలు చేసిన ‘ఆల్వేస్’ (Always) బ్రాండ్‌కు చెందిన ప్యాడ్స్‌లో లార్వా (maggots) ఉన్నట్లు చూపించారు. ప్యాడ్స్‌ను బెడ్ లాంప్ పై ఉంచి పరిశీలించగా.. ఆ ప్యాకేజింగ్‌లో లార్వా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను చూసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆల్వేస్ బ్రాండ్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్న అల్లీ డి, ఇంతకుముందు ఇలాంటి సమస్యను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. ప్యాడ్స్‌ను పరీక్షించేటప్పుడు ఆమె తీవ్ర అసహ్యం వ్యక్తం చేసింది. బయటి ప్యాకేజింగ్ శుభ్రంగా ఉన్నప్పటికీ, లోపల లార్వా ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ వీడియో వైరల్ తర్వాత.. ఆల్వేస్ కంపెనీ వెంటనే అల్లీ డి ఫిర్యాదుకు స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఈ సంఘటనపై కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు కొన్ని వివరాలు అడిగింది. ప్యాడ్స్‌ను ఎక్కడ కొనుగోలు చేశారు..? ఎలా నిల్వ చేశారు..? కనుగొనడానికి ముందే ప్యాకేజింగ్ తెరిచి ఉందా వంటి వివరాలు కోరింది. సమస్యను పూర్తిగా పరిశోధించడానికి, ఉపయోగించని ప్యాడ్స్‌తో పాటు కలుషితమైన ప్యాడ్‌ను కూడా తిరిగి పంపించవలసిందిగా కంపెనీ కోరింది.

Test Cricket Record: 6 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు, 35 పరుగులు.. 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!

అంతేకాకుండా, ఆల్వేస్ కంపెనీ తమ చాలాకాలం నుండి కస్టమర్‌గా ఉన్న అల్లీ డికి 10 డాలర్ల కూపన్ను అందించింది. అయితే, జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా ఈ పరిహారం సంతృప్తికరంగా లేదని అల్లీ డి అన్నారు. కంపెనీ మరింత పరిహారం గురించి ఆలోచిస్తే, రుజువు కోసం తాను వీడియోను, కలుషితమైన ప్యాడ్స్‌ను భద్రపరుచుకుంటానని ఆమె తెలిపారు.

Exit mobile version