Shocking Viral Video: మహిళలు జాగ్రత్త.. సానిటరీ ప్యాడ్స్‌లో ‘లార్వా’.. వీడియో వైరల్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Always బ్రాండ్ శానిటరీ ప్యాడ్స్‌లో లార్వా
- ప్యాకేజింగ్ బయట శుభ్రంగా ఉన్నప్పటికీ, లోపల లార్వా
- ప్యాడ్స్ భద్రతపై ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Viral Video: మహిళలకు ఋతుచక్రం రావడం అనేది దేవుడి సృష్టి. ఆ సమయంలో మహిళలు అనుభవించే బాధ చెప్పలేనిది. ఇది ఇలా ఉండగా ఋతుచక్రం సమయంలో మహిళలు తీసుకొనే జాగ్రత్తలలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ గురించి. అవును.. కాలక్రమేణా మహిళలు వీటికి అలవాటు పడిపోయారు. ఇక ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలు ఇందుకు సంబంధించి కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయి.
Maruti Suzuki Victoris: విడుదలై నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే రూ.15,000 ధర పెంపు..!
Also Read
అయితే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ భద్రతపై ఆందోళన కలిగించే విషయం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా కలకలం రేపే ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అల్లీ డి (Allie D) అనే మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఆమె కొత్తగా కొనుగోలు చేసిన ‘ఆల్వేస్’ (Always) బ్రాండ్‌కు చెందిన ప్యాడ్స్‌లో లార్వా (maggots) ఉన్నట్లు చూపించారు. ప్యాడ్స్‌ను బెడ్ లాంప్ పై ఉంచి పరిశీలించగా.. ఆ ప్యాకేజింగ్‌లో లార్వా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను చూసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆల్వేస్ బ్రాండ్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్న అల్లీ డి, ఇంతకుముందు ఇలాంటి సమస్యను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. ప్యాడ్స్‌ను పరీక్షించేటప్పుడు ఆమె తీవ్ర అసహ్యం వ్యక్తం చేసింది. బయటి ప్యాకేజింగ్ శుభ్రంగా ఉన్నప్పటికీ, లోపల లార్వా ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ వీడియో వైరల్ తర్వాత.. ఆల్వేస్ కంపెనీ వెంటనే అల్లీ డి ఫిర్యాదుకు స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఈ సంఘటనపై కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు కొన్ని వివరాలు అడిగింది. ప్యాడ్స్‌ను ఎక్కడ కొనుగోలు చేశారు..? ఎలా నిల్వ చేశారు..? కనుగొనడానికి ముందే ప్యాకేజింగ్ తెరిచి ఉందా వంటి వివరాలు కోరింది. సమస్యను పూర్తిగా పరిశోధించడానికి, ఉపయోగించని ప్యాడ్స్‌తో పాటు కలుషితమైన ప్యాడ్‌ను కూడా తిరిగి పంపించవలసిందిగా కంపెనీ కోరింది.
అంతేకాకుండా, ఆల్వేస్ కంపెనీ తమ చాలాకాలం నుండి కస్టమర్‌గా ఉన్న అల్లీ డికి 10 డాలర్ల కూపన్ను అందించింది. అయితే, జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా ఈ పరిహారం సంతృప్తికరంగా లేదని అల్లీ డి అన్నారు. కంపెనీ మరింత పరిహారం గురించి ఆలోచిస్తే, రుజువు కోసం తాను వీడియోను, కలుషితమైన ప్యాడ్స్‌ను భద్రపరుచుకుంటానని ఆమె తెలిపారు.
🚨 SHE JUST OPENED A BRAND-NEW PACK OF PADS – AND WHAT SHE FOUND INSIDE LEFT HER SHAKING
This woman says it’s her first ever video because she’s “scared for her life.”
She’s used the same pad brand for years, but after seeing warnings on TikTok, she decided to check hers.
“I… pic.twitter.com/n3CXT91UKW
— HustleBitch (@HustleBitch_) October 21, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?