Site icon NTV Telugu

Shocking Video: ఛీ.. వీళ్లసలు మనుషులేనా.. కారు దొంగిలించి పోతూ కావాలని సైకిలిస్టును ఢీకొట్టారు

Shocking Video

Shocking Video

Shocking Video: షాకింగ్ కు గురిచేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కారులో ఉన్న కొంతమంది యువకులు సరదా కోసం సైక్లిస్ట్‌పైకి దూసుకెళ్లారు. వైరల్ క్లిప్‌లో స్నేహితుడు కారు నడుపుతున్న యువకుడితో ‘అక్కడ వెళ్తున్న అతడిని కొట్టండి’ అని చెప్పడం వినవచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ప్రమాదంలో వృద్ధుడు మరణించాడు. హృదయ విదారకమైన ఈ ఉదంతం అమెరికాలోని లాస్ వెగాస్‌కి చెందినది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ వెగాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రిటైర్డ్ పోలీసు అధికారి. ఆయన వయసు 64 ఏళ్లు. తను ఆండ్రియాస్ ప్రాబ్స్ట్‌గా గుర్తించారు. ఆగస్టు 14న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆండ్రియాస్ సైకిల్‌పై బయటకు వెళ్లాడు. అప్పుడు కారులో ఉన్న యువకులు వారిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. ఆండ్రియాస్‌ను వెంటనే యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read Also:KTR Tweet: రాబందుల రాజ్యమొస్తే.. రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! కేటీఆర్ ట్విట్ వైరల్..!

వీడియో ప్రారంభంలో కారులోని యువకులు వెస్ట్ సెంటెనియల్ పార్క్‌వే సమీపంలోని నార్త్ టెనాయ వేలో అధిక వేగంతో ఇతర కార్లను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఇంతలో వారి కళ్ళు సైకిల్ తొక్కుతున్న ఆండ్రియాస్ మీద పడ్డాయి. అప్పుడు కారులో కూర్చున్న యువకుడు డ్రైవరుతో – సిద్ధమా? అప్పుడు అతను నవ్వుతూ – అవును అతడిని ఢీకొట్టండి అంటాడు. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి బలంగా ఢీకొనడంతో సైక్లిస్ట్ ఆండ్రియాస్ గాలిలో చాలా అడుగుల ఎత్తులో ఎగిరి రోడ్డుపై పడడం వీడియోలో చూడవచ్చు. ఈ చర్యను ఆ వ్యక్తులు చిత్రీకరిస్తూనే ఉన్నారు. గుర్తు తెలియని 17 ఏళ్ల డ్రైవర్‌ను సంఘటన జరిగిన వెంటనే అరెస్టు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో,ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలపై యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసు శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read Also:Nayanthara : ఐకాన్ స్టార్ ట్వీట్ కు స్వీట్ రిప్లై ఇచ్చిన లేడీ సూపర్ స్టార్..

Exit mobile version