Site icon NTV Telugu

Shocking Video: ఇదేందయ్య ఇదీ.. దండ ఇంత బారుంది.. ఇది నేను చూడ్లే..

Money

Money

అంగరంగ వైభవంగా జరిపే వివాహాలకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వారి పెళ్లిని వరుడు, వధువు తమ వివాహాలను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం పెళ్ళివారు అనేక పెళ్లి పనులలో కొత్తదనాన్ని వెతుకుతుంటారు. ఇదే తరహాలో, ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక దేశీ వరుడు తన వివాహ ఉత్సవాలలో తన సంపదను ప్రదర్శించినందుకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇకపోతే, ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే., అతని హారం చక్కగా 500 రూపాయల నోట్లతో తయారు చేయబడింది, దీని విలువ 20 లక్షల రూపాయలు.

Also Read: Lottery Jackpot : జాక్‌పాట్ కొట్టిన మేస్త్రీ.. నెలకు రూ.కోటి చొప్పున 30 ఏళ్ల పాటు..

వరుడు తన స్నేహితులతో నిలబడి ఉన్న పైకప్పు దగ్గర నుండి భూమి మీదకు విస్తరించి ఉంది ఈ హారం. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా త్వరగా వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. అలాగే అనేక కామెంట్స్ ను పొందింది. ఇలా డబ్బులను మాలలాగ చేయడంతో అనేక రకాల అభిప్రాయాలను సోషల్ మీడియాలో పొందింది.

Also Read: Dabbawala service: లండన్‌ లోనూ ‘డబ్బావాలా’.. వీడియో వైరల్..

కొంతమంది వరుడి గొప్పలను చూస్తూ ఆశ్చర్యపోయారు. మరికొందరైతే ఇది చేయడం వేడుకలకు చిహ్నంగా కూడా భావించార. మరికొందరు అటువంటి విపరీత ప్రదర్శన ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version