NTV Telugu Site icon

Jagapati Babu : ఫోటో ఇచ్చి అందరికీ పనిచెప్పిన జగ్గూ భాయ్

New Project 2025 02 22t195608.901

New Project 2025 02 22t195608.901

Jagapati Babu : సోష‌ల్ మీడియా ప్రపంచంలో ఇప్పటికే చాలా మంది స్టార్లుగా మారిపోయారు. ఇక సెలబ్రిటీలకు కూడా ఇది ఓ అద్భుతమైన వేదికగా మారింది. దాంతో చాలా మంది హీరోలు, హీరోయిన్లతో పాటు స‌పోర్టింగ్ రోల్స్ చేసే న‌టులు కూడా తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో జగపతిబాబు కూడా ఒకరు.

తాజాగా జగపతిబాబు తన ఎక్స్ అకౌంట్‌లో ఓ గ్రూప్ ఫోటోను షేర్ చేసి, అందులో తను ఎక్కడ ఉన్నానో కనుక్కోవాలని అభిమానులకు ఛాలెంజ్ విసిరారు. ఈ ఫోటోని చూసిన ఫ్యాన్స్‌కు మొదట మాత్రం అతడిని గుర్తించడంలో కాస్త కష్టం వచ్చింది. కానీ, చివరికి ఫ్యాన్స్‌నే ఆయన స్థానాన్ని కనుగొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also:PM Modi Call To Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్.. పూర్తిస్థాయి సహకారం ఉంటుందని హామీ

సోష‌ల్ మీడియా వేదికపై ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జగపతి బాబు, కేవలం సినిమాల గురించి కాకుండా తన ప‌ర్స‌న‌ల్ లైఫ్, వెకేష‌న్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ, తన ఫ్యాన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల తన డైట్ గురించి కూడా కొన్ని పోస్టులు చేసిన జగపతి బాబు, రోడ్‌సైడ్ దాబాలో భోజనం చేసేటప్పుడు తీసిన ఫోటోలు కూడా షేర్ చేసి తన సింప్లిసిటీ జీవితం గురించి తెలియజేశారు.

కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా త‌మిళ‌, హిందీ చిత్రాల్లో విలన్‌గా పలు పాత్రలు పోషిస్తున్నారు. జగపతి బాబు ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం, ఆయన టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్నారు. అందులో రామ్ చ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న “ఆర్సీ16″లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also:Iran: టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..