NTV Telugu Site icon

Vande Bharat: వందేభారత్‌పై రాళ్లదాడి.. విచారణలో సంచలన విషయాలు?

Vande Bharat

Vande Bharat

యూపీలోని వారణాసిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన వెనుక వెలుగు చూసిన విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రైలు అద్దాలను పగలగొట్టి రైలు వేగాన్ని తగ్గించడం మాత్రమే రాళ్లదాడి లక్ష్యం అని యూపీ ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత కిటికీ దగ్గర కూర్చున్న ప్రయాణికుల మొబైల్‌ ఫోన్లను లాక్కెళ్లేందుకు ప్లాన్‌ చేశారు. ఈ కేసులో నిందితుడు హుస్సేన్ అలియాస్ షాహిద్‌ను చందౌలీలోని మొఘల్‌సరాయ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో ఈ విషయాలు చెప్పాడు నిందితులు.

READ MORE: West Bengal: ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే.. బెంగాల్‌లో మైనర్ బాలికపై దారుణం..

వాస్తవానికి.. అక్టోబర్ 2, 2024న వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కాన్పూర్‌లోని పంకీ స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి సంఘటన జరిగింది. రైలు ఏసీకోచ్ కిటికీ అద్దాలు పగిలిపోవడంతో చాలా మంది ప్రయాణికులు భయబ్రంతులకు గురయ్యారు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ పంకీ, జీఆర్పీ కంట్రోల్ ప్రయాగ్‌రాజ్‌లకు సమాచారం అందించారు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

READ MORE:Tiruvuru: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు..

వారణాసి ఏటీఎస్ యూనిట్ ఈ కేసును దర్యాప్తు ప్రారంభించి నిందితుడు హుస్సేన్ అలియాస్ షాహిద్‌ను అరెస్టు చేసింది. రాళ్లు రువ్వడం అసలు ఉద్దేశం రైలు వేగాన్ని తగ్గించడమేనని, దీంతో కిటికీ దగ్గర కూర్చున్న ప్రయాణికుల మొబైల్ ఫోన్‌లు సులభంగా లాక్కెళ్లవచ్చని విచారణలో వెల్లడించాడు. ఈ కుట్ర భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ముందు కూడా వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. కాన్పూర్‌తో పాటు, ఇటావాలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఈ ఘటనలు రైల్వే, భద్రతా బలగాలకు సవాల్‌గా మారాయి.

READ MORE:Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం.. ప్రయాణికుల అవస్థలు

ఈ ఘటన తర్వాత రైల్వే యంత్రాంగం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో భద్రతను పెంచింది. అదనపు నిఘాను తీసుకుంటోంది. ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సంయుక్త బృందాలు ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఐదు పోలీసు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Show comments