NTV Telugu Site icon

Airtel Palns Hike: ఎయిర్‌టెల్‌ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. పెరిగిన మూడు ప్లాన్‌ల ధరలు!

Bharti Airtel

Bharti Airtel

Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్‌టెల్’ తమ మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్‌టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన మూడు డేటా ప్లాన్‌ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79, రూ.181, రూ.301 డేటా ప్యాక్‌ల ధరను కంపెనీ పెంచింది.

Rs 79 Plan Hike:
ఎయిర్‌టెల్ రూ.79 డేటా ప్లాన్ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరపై రూ.20 పెంచడంతో ఇప్పుడు రూ.99కి అందుబాటులో ఉంది. ఈ డేటా ప్లాన్ కస్టమర్లకు ప్రతిరోజూ 20జీబీ డేటాను అందిస్తుంది.

Rs 181 Plan Hike:
ఎయిర్‌టెల్ తన రూ.181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది. దాంతో ఈ ప్లాన్ ధర రూ.211కు చేరింది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. రోజుకు 1GB డేటాను పొందుతారు. రెగ్యులర్ ప్లాన్‌ డేటాతో పాటు అదనంగా 1జీబీ డేటా అవసరమైన వారు ఈ ప్లాన్ వాడుతున్నారు.

Also Read: Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్

Rs 301 Plan Hike:
రూ.301 డేటా ప్లాన్‌పై రూ.60 పెరిగింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ.361గా ఉంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 50జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. బేస్ ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ 50జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ మార్పులతో ఎయిర్‌టెల్‌ యూజర్లపై మరింత భారం పడింది.