UP: కారుతో తొక్కించి తండ్రి, సోదరుడి దారుణ హత్య.. ఆస్తి కోసం భార్యే ఉసిగొలిపింది..!
- యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలో ఘటన
- భార్యతో కలిసి తండ్రి, సవతి సోదరుడి దారుణ హత్య
- కారుతో తొక్కించి హత్య చేసిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
READ MORE: Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం, మక్సూద్ తన భార్య నూర్బానోతో కలిసి కారులో బయలుదేరాడు. దారిలో అతని తండ్రి హాజీ నాన్హే (61), సవతి సోదరుడు మిసార్యార్ ఖాన్ (33) బైక్‌పై ఫరీద్‌పూర్ వైపు వెళుతున్నారు. చందోఖా మలుపు సమీపంలో మక్సూద్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. వారిద్దరూ రోడ్డుపై పడిపోయిన వెంటనే, మక్సూద్ వారిపై కారును ఎక్కించాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు మక్సూద్ ఇద్దరి మృతదేహాలను సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి నెట్టి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: IND vs ENG: ఎంతకు తెగించార్రా.. గిల్‌ను అవుట్ చేయలేక ఇలాంటి సిల్లీ ఐడియాస్ ఏంటో..!
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మక్సూద్ గత 6 నెలలుగా తన తండ్రి, సోదరుడిని అంతమొందించాలని ప్లాన్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నూర్బానోను అరెస్టు చేశారు. విచారణలో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతానికి నూర్బానోను జైలుకు తరలించారు. మక్సూద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య ఆస్తికోసంమే జరిగిందని.. భార్య నూర్బానో భర్త మక్సూద్‌ను హత్య చేసేందుకు ఉసిగొలిపిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!