Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 50 మంది కార్మికులపై యజమాని..!
- చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన
- 50 మంది కార్మికులపై యజమాని కర్కశత్వం
- జీతాలు అడిగినందుకు చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. స్థానిక ‘SAB’ ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కూలీలపై యజమాని పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. కడుపు నిండా తిండి పెట్టకపోగా, చేసిన పనికి జీతాలు అడిగినందుకు వారిని చిత్రహింసలకు గురిచేశాడు. ఒడిశా నుంచి వలస వచ్చిన సుమారు 50 మంది కూలీలు గత కొంతకాలంగా ఈ బట్టీలో పనిచేస్తున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చామన్న సాకుతో యజమాని వారిని బానిసలకంటే హీనంగా చూస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక 10 రోజుల క్రితం ఇంటర్నెట్ నేషనల్ జస్టీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూలీలు ఒడిశా లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలిసిన యజమాని ఆగ్రహంతో ఊగిపోయి, కూలీలపై మరోసారి దాడికి తెగబడ్డాడు. వారిని ఒక లారీలో బలవంతంగా నిర్బంధించి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టి చేతులు దులుపుకున్నాడు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం బాధితుల ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించి.. చెల్లాచెదురైన కూలీలను సురక్షితంగా రక్షించారు. బాధితులందరినీ వెంటనే తిరుపతి కలెక్టరేట్‌కు తరలించారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ప్రస్తుతం ఆర్డీవో రామ్మోహన్ బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసుకున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చి తమను వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, తిండి పెట్టకుండా కొడుతున్నారని కూలీలు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడైన ఇటుక బట్టీ యజమానిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. కటకటాల్లోకి పంపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ వేగవంతమైన చర్యతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!