NTV Telugu Site icon

Shivam Dube – SKY: శివాలెత్తిన సూర్య-శివమ్ దూబే జోడి

Shivam

Shivam

Shivam Dube – SKY: నేడు (డిసెంబర్ 3)న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, సర్వీసెస్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. ఒకవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, దూబే కేవలం 37 బంతుల్లో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దూబే, సూర్యకుమార్ లు 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ముంబై విజయానికి ఎంతగానో సహాయపడింది.

Also Read: Zomato Large Order Fleet: జొమాటోలో ఉన్న ఈ ఫీచర్‌ గురించి తెలుసా?

ముంబై, సర్వీసెస్ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఇందులో మొదటగా ఆడిన ముంబై జట్టు 192 పరుగులు చేసింది. ఇందులో మొదట ముంబై జట్టు స్కోరు 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి దూబే, సూర్యకుమార్ కలిసి కేవలం 66 బంతుల్లో 130 పరుగులు జోడించారు. భారత స్టార్ ఆటగాళ్లిద్దరూ కలిసి 9 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టారు. ఇక వీరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే 22 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ కూడా 20 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్ జట్టు 153 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..

సూర్యకుమార్ తన సోదరి పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. వచ్చి రాగానే 152 స్ట్రైక్ రేట్ తో ఆడి ముంబై విజయానికి బాట వేసాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున సూర్యకుమార్ మిగతా అన్ని మ్యాచ్‌లు ఆడబోతున్నాడన్న సమాచారం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో ముంబై జట్టు గ్రూప్ Eలో ఉంది. ట్రోఫీలో ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం పట్టికలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉంది. లీగ్ దశలో ముంబై చివరి మ్యాచ్ డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతుంది. ఇకపోతే, గత 2022-2023 సీజన్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఛాంపియన్‌గా నిలిచింది.