Site icon NTV Telugu

RC16: ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం.. శివన్న లుక్ వైరల్!

Shiva Rajkumar Rc16

Shiva Rajkumar Rc16

RC16 Team Special Birthday Wish To Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16 (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ పూర్తిచేసుకున్న చరణ్‌.. RC16తో బిజీ కానున్నాడు.

RC16లో కన్నడ ‘సూపర్ స్టార్’ శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా RC16 చిత్ర యూనిట్ ప్రత్యేకంగా విషెష్ తెలిపింది. ఓ పోస్టర్ రిలీజ్ చేసి.. ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం అని పేర్కొంది. RC16 టీమ్ తరఫున శివన్నకి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. ఈరోజుతో శివన్న 61 పడిలోకి అడుగుపెట్టారు. ఇప్ప‌టికే బ‌జ‌రంగీ, వేధ, జైల‌ర్ సినిమాల‌తో తెలుగు నాట కూడా మంచి గుర్తింపును ద‌క్కించుకున్న శివ రాజ్‌కుమార్.. మొదటిసారి తెలుగు సినిమాలో న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెలకొంది.

Also Read: Virat Kohli-BCCI: విరాట్ కోహ్లీకి ఆ విషయాన్ని బీసీసీఐ చెప్పలేదట!

బుచ్చిబాబు విజన్‌ ఉన్న డైరెక్టర్‌ అని శివ రాజ్‌కుమార్‌ కొనియాడిన విషయం తెలిసిందే. ‘నాకు స్క్రిప్టు నెరేట్‌ చేసేందుకు బుచ్చిబాబు సంప్రదించగా.. అరగంట సమయం ఇచ్చా. ఆయన వివరించే తీరు బాగుండడంతో గంటన్నరపైగా కేటాయించా. కథ, అందులోని పాత్రలను బుచ్చిబాబు చక్కగా రాశారు. రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటుడు. అంతకుమించి మంచి మనిషి’ అని శివన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Exit mobile version