NTV Telugu Site icon

Sanjay Raut: మహాయుతి ప్రభుత్వంపై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు.. ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలంటూ..!

Sanjay Raut

Sanjay Raut

మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు. ‘ముందుగా ముఖ్యమంత్రి ఊరేగింపును అక్కడికి తీసుకువెళతారు. సీఎం ఊరేగింపు చేపట్టే ముందు ఈవీఎంల ఊరేగింపు చేపట్టాలని, తొలి కేబినెట్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. .

Read Also: Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?

కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై నిర్ణయం తీసుకోలేక పోయిందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్రలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని సంజయ్ రౌత్ తెలిపారు. ‘‘ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఎవరికి ఏ శాఖ ఉందో తెలియడం లేదు.. మహారాష్ట్ర గ్రామాల్లో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనికి సమాధానం చెప్పలేని సీఎం.. మహారాష్ట్రలో అరాచకం సాగుతుంది. ఈ ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడింది, వారికి మెదడు లేదు, వారి మెదళ్లలో ఈవీఎంలు ఉన్నాయి” అని రౌత్ ఆరోపించారు.

Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట

అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ‘ఏక్‌ హైతో సేఫ్‌ హై’ అనే ప్రధాని మోదీ నినాదం రాష్ట్రంలో మాయాజాలంలా పని చేసిందని ఫడ్నవీస్‌ చెప్పారు. డిసెంబరు 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం చేయగా.. ఉపముఖ్యమంత్రులుగా శివసేన అధినేత ఏక్‌నాథ్‌ షిండే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఈ ఫలితాలు కీలక మైలురాయిగా నిలిచాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కూడా వరుసగా 57, 41 స్థానాలతో విజయాలు సాధించాయి.

Show comments