NTV Telugu Site icon

NZ Vs SL : షిప్లే దెబ్బకు ఎగిరిన వికెట్.. షాక్ లో నిసాంక

Nz Vs Sl

Nz Vs Sl

శ్రీలంక న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో కివీస్ జట్టు ఘన విజయం సాధించింది. లంకేయులతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుతమైన బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లకు చక్కలు చూపించాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దసున్ షనక టీమ్ షిప్లే దెబ్బకు అల్లాడిపోయింది. న్యూజిలాండ్ పేసర్ మ్యా,చ్ హెన్రీ బౌలింగ్ లో లంక ఓపెనర్ నవనీడు ఫెర్నాండో రనౌడ్ ( 2.1ఓవర్ లో ) అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ తొలి వికెట్ భాగస్వామ్యం అయ్యారు. ఇక ఆ తర్వాత షిప్లే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 3.3 ఓవర్ లో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంకను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు.

Also Read : TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

గంటకు 132.5 కిలో మీటర్ల వేగంతో షిప్లే విసిరిన బంతికి దెబ్బకు వికెట్ ఎగిరి దూరంగా వెళ్లి పడింది. షిప్లే దెబ్బకు అవాక్కైన నిసాంక బిక్కమొహం వేసుకున్న పెవిలియన్ బాట పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక 10 ఓవర్లలోపే షిప్లే.. నిసాంక (9 ), సహా కుశాల్ మెండిస్ ( 0), చరిత్ అసలంక ( 9), కెప్టెన్ దసున్ షనక ( 0), చమిక కరుణత్నె ( 11)వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే కివీస్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక 76 పరుగులకే ఆలౌట్ అయింది. 198 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో విజయంతో న్యూజిలాండ్ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఆటగాళ్లు అద్బుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించారు.

Also Read : Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి ప్రాంక్స్, జిమ్ని లాంచ్ వివరాలు ఇవే..

Show comments