NTV Telugu Site icon

Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. ఓ అమ్మాయితో ధావన్ (వీడియో)

Shikar

Shikar

శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదే సందేహం కలుగుతుంది. శిఖర్ ధావన్ ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పటికీ.. తనతో పాటు ఆమె విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ధావన్‌తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా క్లారిటీ లేదు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ జీవితంలో కొత్తదనం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read Also: AP CM Chandrababu: సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి..

కొత్త అమ్మాయితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధావన్ బ్లూ టీ-షర్టు, నలుపు కార్గో ధరించి కనిపించాడు. ఈ వీడియోలో ధావన్ తో ఆ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి కెమెరా కంట పడకుండా ఉండేందుకు తనను తాను సిగ్గుపడటం కనిపిస్తుంది. ధావన్‌తో తన ఫోటోను ఒకే ఫ్రేమ్‌లో తీయకూడదని ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ధావన్ కొత్త అమ్మాయితో కనిపించడంపై… రానున్న రోజుల్లో శిఖర్ ధావన్‌తో ఈ కొత్త సంబంధం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also: SBI Alert: కొత్త స్కామ్‌పై ఖాతాదారులకు హెచ్చరిక
ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. అతను ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 269 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 10867 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 24 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు సాధించాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 51.50 సగటుతో 412 పరుగులు చేశాడు.

Show comments