NTV Telugu Site icon

Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్‭లో శిఖ‌ర్ ధావ‌న్ సాధించిన రికార్డ్స్ ఇవే..

Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇకపోతే శిఖర్ ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులలో 2315 రన్స్, 167 వన్డేలలో 6793 రన్స్, 68 టీ20 లలో 1759 రన్స్ సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌ గా ఉన్న శిఖ‌ర్ ధావ‌న్.. రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. భుజం గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ధావన్ స్థానంలో సామ్ క‌ర‌న్‌కు కెప్టెన్సీ చేసాడు. గాయం నుంచి కోలుకున్నా ధావన్ ను పక్కన పెట్టింది మేనేజ్మెంట్. 222 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధావన్ 6768 రన్స్ చేశాడు.

ధావన్ కెరీర్ లో మొత్తంగా 17 వన్డే సెంచరీలు.., 7 టెస్ట్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 190 అత్యధిక స్కోరు. వన్డేలో 143. టీ20 ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇక ఐపీఎల్ లో 2 సెంచరీలు చేసాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‭లో 10887 పరుగులు చేయగా.. ఐపీఎల్ లో 6769 పరుగులు చేసాడు.

ధావన్ పై ఉన్న రికార్డ్స్ చూస్తే..

– 2013లో భారత్ తరఫున అత్యధిక పరుగులు.

– 2015 ప్రపంచకప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు.

– 2017లో భారత్ తరఫున అత్యధిక పరుగులు.

– 2018 ఆసియా కప్ లో భారత్ కు అత్యధిక పరుగులు

– తొలి టెస్టులో శతకం (187).

– 100వ మ్యాచ్లో శతకం

– కెరీర్లో అత్యధిక 90లు (7th)

– వేగవంతమైన 6000 పరుగులు

– ఐపీఎల్లో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు సాధించిన మొదటి వ్యక్తి.