Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. శృంగార వీడియోల్లో నటించాలని రాజ్ కుంద్రా తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడినచాలా గ్యాప్ తరువాత ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన పౌరాష్‌పూర్- 2 వెబ్ సిరీస్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన షెర్లిన్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Samantha: చిన్మయి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సమంత
రాహుల్ గాంధీ అంటే తనకు ఇష్టమని, అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒప్పుకొంటే పెళ్లి కూడా చేసుకుంటా.. కానీ, ఒక కండీషన్. నాకు నా ఇంటి పేరును మార్చుకోవడం ఇష్టం లేదు. అది రాహుల్ స్వీకరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సిరీస్ తరువాత షెర్లిన్ ఎలాంటి సిరీస్ లు చేస్తుంది.. ? ఛాన్స్ లు వస్తాయా.. ? లేవా అనేది తెలియాల్సి ఉంది.