బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసింది బాధితురాలు శేజల్. ఈ సందర్భంగా శేజల్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐకి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యాక.. మాకు ప్రొటెక్షన్ ఇచ్చాకే హైదరాబాద్ కు వెళ్తామని ఆమె వెల్లడించారు. అరిజన్ డైరీలో దుర్గం చిన్నయ్య అనుచరులకు వాటా ఇచ్చామని ఆమె తెలిపారు. దుర్గం చిన్నయ్య తన అధికారం ఉపయోగించి మాపై కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు.
Also Read : Delhi: కోవిడ్ నుండి భారతదేశంలో విమాన ఛార్జీలు 41% పెరిగాయి.. కారణమేంటంటే..!
మాతో పాటూ ఎమ్మేల్యే అనుచరులపై కూడా కేసు నమోదు అయిందని, పోలీసులకు డబ్బులిచ్చి ఎమ్మేల్యే అనుచరులపై కేసు లేకుండా చేశారన్నారు శేజల్. అంతేకాకుండా.. అధికారం అడ్డుపెట్టుకుని, ఎమ్మెల్యే మమ్ములని వేధించారన్నారు. ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అగ్రిమెంట్ పేపర్లు సీబీఐకి ఇచ్చామన్నారు. మేం రైతులను మోసం చేయలేదని, మోసపోయిన రైతులు ఎవరైనా ఉంటే రమ్మని కోరామని ఆమె అన్నారు.
Also Read : Helmet: హెల్మెట్ నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.. దీని వెనుకున్న సైన్స్ ఏమిటీ..?