Site icon NTV Telugu

Kerala: కేరళలో తొలి కల్లుగీతా మహిళా కార్మికురాలిగా షీజా..

Sheeja,

Sheeja,

మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరుపించింది కేరళ కి చెందిన షీజా. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సాహసానికి ఒడిగట్టింది. పదుల అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూర్‌కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ కష్ట తరంగా మారింది. కల్లుగీతను వృత్తిగా ఎంచుకుంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది.

READ MORE: Stormy Daniels: కోర్టు ముందు ట్రంప్‌తో రిలేషన్‌షిప్ గురించి చెప్పిన అడల్డ్‌ స్టార్‌

కేరళలో మొట్టమొదటి కల్లుగీత మహిళా కార్మికురాలిగా ఈమె నిలిచింది. షీజా, జయకుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కార్పెంటరుగా పనిచేసే జయకుమార్‌ 2019లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు పని చేయలేకపోవడంతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. షీజా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగింది. కుటుంబ బాధ్యతను స్వీకరించిన షీజా వివిధ సామాజిక సంస్థలు, క్లబ్బుల నుంచి పలు అవార్డులను అందుకొంది. వ్యవసాయం కూడా చేస్తున్న ఈమె అన్నీ తానై భర్తను, పిల్లలను పోషించుకుంటోంది. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే మానసిక ధైర్యం కోల్పోతున్న నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. షీజా స్త్రీ జాతి గర్వించేలా చేసిందని పలువురు మెచ్చుకుంటున్నారు. ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని కోరుతున్నారు.

Exit mobile version