Shashtipoorthi : షష్టిపూర్తి గ్లింప్స్.. రాజేంద్రప్రసాద్ తో 38ఏళ్ల తర్వాత వస్తున్న అర్చన
- 38ఏళ్ల తర్వాత వస్తున్న రీఎంట్రీ ఇస్తున్న అర్చన
- ఆకట్టుకుంటున్న షష్టిపూర్తి మూవీ గ్లింప్స్
- ప్రత్యేక ఆకర్షణగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashtipoorthi : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1986లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘లేడీస్ టైలర్’లో అర్చనతో కలిసి ఆయన నటించారు. ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత ఈ జంట ‘షష్టిపూర్తి’ అనే ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. కుటుంబ విలువలు, భావోద్వేగాలపై నడిచే ఈ కథ, ఓ వృద్ధ దంపతుల జీవితాన్ని సున్నితంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా రూపేశ్ చౌధరి లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను హృదయానికి హత్తుకునేలా ఉండబోతుందని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.
Read Also:Delhi: భార్య వేధింపులకు మరొకరు బలి.. తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ భావోద్వేగ భరితమైన కథకు ఆయన మ్యూజిక్ మరింత బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎం కీరవాణి ఓ పాట రాయగా, చైతన్య ప్రసాద్ మరికొన్ని పాటలను అందించారు. ఎస్‌పీ చరణ్ గానం చేసిన మెలోడీ పాట ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్రబృందం వెల్లడించింది. దేవదాస్ ఫేమ్ అకాంక్ష సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో చక్రపాణి ఆనంద, అచ్యుత్ కుమార్, ప్రభాస్ శ్రీను, చలాకీ చంటి, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ రామ్ తదితరులు నటించారు. పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. మా ఆయే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.
Read Also:Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ వ్యక్తి.. హిందువుగా, ఆర్మీ అధికారిగా నమ్మిస్తూ మహిళల మోసం..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!