Site icon NTV Telugu

Sharwanand : శర్వానంద్ – శ్రీనువైట్ల మొదలు పెట్టబోతున్నారు

Sharawa Sreenuvaitla

Sharawa Sreenuvaitla

 టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘నారి నారి నడుమ మురారి’ వంటి సక్సెస్ తర్వాత, ఆయన తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తీసుకురాబోతున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల, ఈసారి శర్వానంద్ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట.

Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ

ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే విభిన్నమైన కామెడీ పాత్రలు, ప్రాసలతో కూడిన డైలాగులు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా కుదిరిందని, శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా వినోదాత్మకమైన పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. టెక్నీషియన్లు మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో శర్వానంద్ తన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version