Site icon NTV Telugu

Naduma Murari : శర్వానంద్-శ్రీవిష్ణు మల్టీస్టారర్?

Naari Naari Naduma Murari

Naari Naari Naduma Murari

యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ తన స్నేహితుడు, హీరో శ్రీవిష్ణు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక చిన్న పాత్రలో మెరిసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. కేవలం తనపై ఉన్న స్నేహంతో, కథను నమ్మి శ్రీవిష్ణు ఈ అతిథి పాత్రలో నటించడం నిజంగా గొప్ప విషయమని శర్వానంద్ కొనియాడారు.

Also Read : Sharwanand: నిర్మాత కోసం రెమ్యూనరేషన్ వదులుకున్న శర్వా!

కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాకుండా, త్వరలోనే వీరిద్దరి కాంబోలో ఒక ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ సినిమా రాబోతోందని శర్వా క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరికీ సరిపడే పక్కా కథ దొరికితే, అనిల్ సుంకర నిర్మాణంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ వేడుకకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరుకాగా, దర్శకులు త్రినాథరావు నక్కిన, వశిష్ట తదితరులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. శర్వా-శ్రీవిష్ణు కలిసి నటిస్తే స్క్రీన్ మీద కామెడీ మరియు ఎమోషన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version