NTV Telugu Site icon

Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari: హీరో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నారి నారి నడుమ మురారి’. సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఇదివరకు బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్‌ను ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. టైటిల్ ద్వారా తెలుస్తున్నట్లుగా, ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర తన జీవితంలో ఇద్దరు మహిళలతో ఉన్న రొమాంటిక్ సవాళ్లపై ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో శాక్షి వైద్య, సమ్యుక్త ప్రధాన పాత్రలు పోషించనున్నారు..

Also Read: Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్సీ రేసులో యశస్వి జైస్వాల్..

ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో హీరోయిన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, హీరో ఆ గందరగోళాన్ని తప్పించుకునే ప్రయత్నంలో కనిపిస్తాడు. బ్యాక్‌డ్రాప్‌లో ఎగురుతున్న కాగితాలు ఈ కథ ఆసక్తికరమైన కోణాన్ని చూపిస్తున్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. భాను బొగవరపు కథ అందించగా, నందు సవిరిగన డైలాగ్ రచన చేశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపడుతున్నారు.

Also Read: Jallikattu: తమిళనాడులోని అవనియపురంలో ప్రారంభమైన జల్లికట్టు..

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. శర్వానంద్ తన కొత్త లుక్ తో మరోసారి అభిమానులను మెప్పించనుండగా, సినిమా కథ మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం ఖాయం.

Show comments