Site icon NTV Telugu

Preity Zinta : నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా.. షారుక్ ఖాన్ కామెంట్స్ కు బిత్తరపోయిన ప్రీతి జింటా

New Project (47)

New Project (47)

Preity Zinta : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరు నటించిన సక్సెస్ కావడంతో హిట్ పెయిర్​గా పేరు సంపాదించారు. అలాగే ఆఫ్ స్క్రీన్​లోనూ షారుక్, ప్రీతీ మధ్య మంచి కెమిస్త్రీ ఉంది. బర్త్ డేలకు విషెస్ చెప్పుకుంటారు. పార్టీల్లోనూ తరచూ కలుసుకుంటుంటారు.

Read Also:South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..

సోషల్ మీడియాలో షారుక్, ప్రీతీ జింటాకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీతి జింటా.. షారూక్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే ఇందులో ప్రీతీని ‘మీరు ప్రెగ్నెంటా’ అని షారుక్ సరదగా అడగగా, ఆమె సిగ్గుపడుతుంది. దానికి ‘మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్​ చేస్తా’నని బాద్ షా మళ్లీ సరదాగా అంటారు. అప్పుడు ప్రీతీ షాక్​కు గురై మళ్లీ ఫన్నీ మూడ్​లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య మంచి స్నేహా బంధం ఉందని, అందుకే షారుక్​అలా సరదాగా అన్నారని సమర్థిస్తుండగా, మరికొందరు స్టార్ హీరో అయ్యుంది షారుక్ ఇలా వ్యవహరించడమేంటని విమర్శిస్తున్నారు.

Read Also:Mr Bachchan: హరీష్ శంకర్…ఇది అవసరమా?

కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షారుక్ వ్యాఖ్యలతో ప్రీతీ జింటా అసౌకర్యాన్ని గురయ్యారని, ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. ఇంకొందరు షారుక్ ఖాన్, ప్రీతీ జింటా బెస్ట్ ఫ్రెండ్స్ అని, వారి మధ్య సరదాగా జరిగిన సంభాషణను సీరియస్​గా తీసుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రీతీ జింటా చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. చాలా కాలంగా సక్సెస్ లేని షారూన్ ను పఠాన్, జవాన్​ సినిమాలు మళ్లీ ట్రాక్ ఎక్కించాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొట్టగా లేటెస్ట్ చిత్రం డంకీ మాత్రం నిరాశ పరిచింది.

Exit mobile version