Stock Market : సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్.. 24వేలు దాటిన నిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు నిరంతరం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గురువారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 79 వేల స్థాయిని దాటగా, నిఫ్టీ కూడా రికార్డు గరిష్ట స్థాయి 24 వేలు దాటింది. అయితే, ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, రెండు ఇండెక్స్‌లు జారిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 269.62 పాయింట్ల లాభంతో 78943.87 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 76 పాయింట్ల లాభంతో 23945 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది
బిఎస్‌ఇ సెన్సెక్స్ కూడా ఈరోజు 78,771.64 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిన్న అత్యధిక స్థాయి 78,759.40ని సాధించింది. మంగళవారం సెన్సెక్స్ 78 వేల స్థాయిని దాటింది. అంటే కేవలం 3 రోజుల్లోనే సెన్సెక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఉదయం నుంచి మార్కెట్ పరిమిత స్థాయిలోనే ట్రేడవుతోంది. సెన్సెక్స్ షేర్లను పరిశీలిస్తే.. దాని 30 షేర్లలో, 12 పెరుగుదలతో ,18 షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ దాని పెద్ద సిమెంట్ డీల్ ఆధారంగా మార్కెట్‌లో టాప్ గెయినర్‌గా మారింది . JSW స్టీల్ తర్వాతి స్థానంలో ఉంది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
Read Also:Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్ గా మారిన అకిరా నందన్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిమరీ!
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్
మార్కెట్ ప్రారంభ సమయానికి, బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ రూ. 437.02 లక్షల కోట్లు కాగా, ప్రారంభమైన అరగంటలో రూ. 438.46 లక్షల కోట్లకు తగ్గింది. మార్కెట్ ప్రారంభమైన ఒక గంట తర్వాత అంటే ఉదయం 10.12 గంటలకు, బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.07 లక్షల కోట్లుకు చేరుకుంది. బీఎస్‌ఈలో ట్రేడైన 3296 షేర్లలో 2060 షేర్లు లాభపడుతున్నాయి. 1122 షేర్లలో క్షీణత ఉంది. 114 షేర్లు ఎటువంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
ఈ స్టాక్స్ లాభనష్టాలను చవిచూశాయి
అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్‌కు చెందిన నిక్కీ, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Read Also:SA vs AFG: పరిస్థితులు అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాం: రషీద్ ఖాన్
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!