Site icon NTV Telugu

Sharad Pawar: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు పిలుపు..

Pawar

Pawar

Be ready for Maharashtra polls: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే నుంచే సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రోజుఎన్సీపీ ( శరద్ చంద్ర పవార్) కార్యాలయంలో పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శరద్ పవార్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురు, బారామతి ఎన్సీపీ (SP) ఎంపీ సుప్రియా సూలే, ఇతర నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను పవార్ ఎగురవేశారు.

Read Also: IND vs PAK: కావాలనే చేశాడు.. మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే: సలీమ్

అయితే, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) ఓట్ల శాతం పెరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఎన్సీపీ(ఎస్పీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. లోక్ సభలో సాధించిన విజయాన్ని మరోసారి మహారాష్ట్రలో పునరావృతం చేయాలని శరద్ పవార్ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో (మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలు 2024) జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మన చేతుల్లోకి వస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు.

Exit mobile version