ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే, పవార్ ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : Harish Rao : NIMS మరో ఘనత.. అభినందించిన మంత్రి హరీష్ రావు
పార్టీ చీఫ్‌గా ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పవార్ చెప్పారు. ప్యానెల్‌లో సుప్రియా సూలే, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపే, ఛగన్ భుజ్‌బల్ తదితర సీనియర్ సభ్యులు ఉండాలి అని శరద్ పవార్ పేర్కొన్నారు. అయితే అజిత్ పవార్ బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు నేపధ్యంలో శరద్ పవార్ నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. శరద్ పవార్ సోదరుడి ( అన్నయ్య) కుమారుడు అజిత్ పవార్.. బీజేపీలో చేరేందుకు సిధ్దమౌతున్నారని గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది.
Also Read : Ugram: నరేష్ కోసం వీళ్లు ఇంత చేస్తారు అనుకోలేదు…
అయితే పవార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే వేదికను వదిలి వెళ్లబోమన్నారు. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మరియు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పవార్, 2019 తర్వాత మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి NCP, కాంగ్రెస్ మరియు తరువాత సైద్ధాంతికంగా శివసేన యొక్క అసంభవమైన కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.