82 Year Old Sharad Pawar delivers speech amid rains in Mumbai: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆదివారం నవీ ముంబైలో ఏర్పాటు చేసిన ఎన్సీపీ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా వర్షం కురిసింది. శరద్ పవార్‌కు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 82 ఏళ్ల శరద్ పవార్ వర్షంలో తడుస్తూ ప్రసంగించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2019 అక్టోబర్‌లో తన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ శరద్ పవార్ మాట్లాడారు. ‘ఈ రోజు కురిసిన వర్షంరో మా ప్రణాళికలకు కాస్త అంతరాయం కలిగింది. అయినా కూడా మేము దేనికీ అంత తేలిగ్గా లొంగిపోము. ఏది ఏమైనా సరే వెనకడుగు వేయం. మా పోరాటాన్ని కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా మేము మా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది’ అని శరద్ పవార్ వర్షంలో తడుస్తూ మాట్లాడారు.
Also Read: Bike Mileage Tips: మీ బైక్ మైలేజీ ఇవ్వడం లేదా?.. అయితే ఈ టిప్స్ పాటించండి!
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు (అక్టోబరు 18) ఎన్సీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి శరద్ పవార్ సతారాకు వెళ్లారు. పవార్ మాట్లాడుతుండగా భారీ వర్షం కురిసింది. వర్షాన్ని లెక్కచేయకుండా ఎన్సీపీ చీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇది పార్టీకి వాన దేవుడు అందిస్తున్న ఆశీర్వాదం అంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే ఘటనను ఇపుడు ఆ పార్టీ నాయకులూ గుర్తు చేసుకొంటున్నారు.