NTV Telugu Site icon

Shanvi Srivastava : లవ్లీ బేబీ.. ఇంత హాట్ గా అప్పుడు చూపిస్తే బ్రేక్ వచ్చేదిగా

Shanvi

Shanvi

Shanvi Srivastava : లవ్లీ సినిమాతో శాన్వి శ్రీవాత్సవ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్​లో కనుమరుగైన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటోంది. ‘లవ్లీ’ లాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో టాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. తర్వాత సుశాంత్ తో అడ్డా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు చిత్రాల్లో కనిపించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తెలుగు పరిశ్రమను వదిలి కన్నడలో సినిమాలు చేస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాల ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గరగా ఉంటోంది. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ… గ్లామర్ షో చేస్తుంది.

Read Also: Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు

ఇక్కడ తెలుగు వాళ్లు పట్టించుకోకపోయినా.. కన్నడిగులు ఈ అమ్మాయిని దగ్గర తీసుకున్నారు. అక్కడ కొంచెం పెద్ద స్థాయి సినిమాల్లో నటించడమే కాక విజయాలు కూడా అందుకుంది. తెలుగులో హోమ్లీగా కనిపించి ఈ క్యూట్ బ్యూటీ అక్కడ గ్లామరస్‌గా కనిపించింది. తాజాగా శాన్వి సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అది చూసిన వాళ్లు ఈ భామలో ఇంట హాట్నెస్ ఉందా అని అశ్చర్చపోతున్నారు. బీచ్ లో బికినితో చూపరులకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన ముఖం కనిపించట్లేదు, ఫొటోలో సైడ్ యాంగిల్లో సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఫొటో చూసి.. ఇంతకుముందే ఇలా షోచేసి ఉంటే తెలుగులో చేతినిండా ఆఫర్లు వచ్చి.. మంచి బ్రేక్ దొరికేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలుగులో తనకు సరైన కెరీర్ లేనందుకు ఆ మధ్య ‘అతనే శ్రీమన్నారాయణ’ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల టైంలో శాన్వి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.

Read Also: Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్

Show comments