NTV Telugu Site icon

Shanampudi Saidi Reddy : ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు

Shanampudi Saidi Reddy

Shanampudi Saidi Reddy

ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీస రేవంత్ రెడ్డిని నేను కోరుతున్న హుజూర్నగర్ ఎమ్మెల్యే టికెట్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి ఇవ్వాలని, 50 వేల మెజార్టీ కాదు.. మొత్తం కలిపిన ఆయనకు 50 వేల ఓట్లు కూడా పడవని శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎప్పుడూ రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతున్నారు… ఈ ఎన్నికల్లో ఆయనకి ఖచ్చితంగా ప్రజలే సన్యాసాన్ని ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. హుజూర్‌ నగర్ అభివృద్ధి నిరోధకుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు.

Also Read : Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం

నాకు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమని, ఆయనకి నియోజకవర్గంలో రాజకీయం చేయడమే ధ్యేయమని శానంపూడి సైదిరెడ్డి ధ్వజమెత్తారు. కోర్టులో కేసులు వేయించి అభివృద్ధిని అడ్డుకోవడమే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పని.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇరిగేషన్ లిఫ్ట్‌లు ఏవి కూడా ప్రస్తుతం సరిగా పనిచేయడం లేదు.. సవాళ్లు విసరడం వెనక్కి వెళ్ళటం ఆయనకే సాధ్యం… 50 వేల ఓట్లు మెజారిటీ వస్తుందంటూ, సర్వే చేయించాను అంటూ మీడియా ముందు ప్రచారం చేస్తున్నాడు… 50,000 మొత్తం కలిపి ఓట్లు కూడా వచ్చే పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మడం లేదు అటు దేశంలోనే కనీసం అధ్యక్షుడు కూడా ఎన్నుకునే పరిస్థితి ఆ పార్టీకి లేదు… స్థానికంగా ఉన్న టీపీసీసీను కూడా స్థానిక నాయకులు గౌరవించే పరిస్థితి లేదు.. అలాంటి వ్యక్తులు విమర్శిస్తే వాటిని పెద్దగా పరిగణములు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు… అభివృద్ధిపైనే నాకు ఆలోచన,,.. పదవుల్లో ఉన్నా లేకున్నా హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Also Read : Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌పై కేసు.. ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన యోగా గురు

Show comments