Apsara Death Case: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రియురాలిని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్ హోల్‌లో పడేసి చేతులు దులుపుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు ప్రియురాలి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడైన సాయికృష్ణ అప్సరను హత్య చేసేందుకే ట్రాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంట్లో కోయంబత్తూర్ పేరు చెప్పి అప్సర బయటికి వచ్చినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఫోర్డ్ కారులో సరూర్‌నగర్ నుంచి బయలుదేరిన అప్సర, సాయి.. శంషాబాద్ చేరుకున్న తర్వాత రాళ్ళగూడ వైపు కారును తీసుకెళ్లాడు. రాళ్లగూడలో సాయి, అప్సరలు కలిసి భోజనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భోజనం చేసిన తర్వాత ఫోర్డ్ కారులో అప్సర ఫ్రంట్ సీటులో రిలాక్స్‌డ్ మోడ్‌లో కూర్చుంది. ఇదిలా ఉండగా.. అప్సరను హత్య చేసేందుకే ఇంటి దగ్గర నుంచి బెల్లం దంచే దొడ్డు కర్రని సాయి తీసుకొచ్చాడు. అప్సర రిలాక్స్‌గా కూర్చొని నిద్రిస్తున్న సమయంలో తలపై దాడి చేసి హత్య చేశాడు. అప్సరను అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటిముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత మట్టిని అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు డ్రామా ఆడాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపినట్లు తెలిసింది.
Read Also: Bandi Sanjay: బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుంది..
ఇదిలా ఉండగా.. కూతురు కనిపించట్లేదంటూ అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న నేపథ్యంలో హత్య చేశానని సాయి ఒప్పుకున్నాడు. దీంతో పాటు గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలిసింది.వివాహం చేసుకోవాలని అప్సర చిత్ర హింసలకు గురి చేసిందని సాయి చెప్పాడు. వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే హత్య చేశానని సాయి తెలపడంతో అసలు నిజం బయటపడింది.
Read Also: Mumbai Mira Road Incident: ముంబై “లివ్ ఇన్ పార్ట్‌నర్” హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
అసలేం జరిగిందంటే.. సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే.. వీరిద్దరూ రెండ్రోజుల కిందట కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ.. ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్‌నగర్‌కు తీసుకువచ్చాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అక్కడి నుంచి శంషాబాద్ తిరిగి చేరుకొని.. ఏమీ ఎరగనట్లు తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. సాయికృష్ణ సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తోపాటు.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు.
