Site icon NTV Telugu

Bomb Threat -Shamshabad Airport : ఆగని బాంబు బెదిరింపులు.. నేడు మరో రెండు విమానాలకు బెదిరింపు మెయిల్స్‌

Bomb Threats To Flights

Bomb Threats To Flights

Bomb Threat Triggers Alert at Shamshabad Airport : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి బాంబు బెదిరింపుల కలకలం కుదిపేసింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్‌ ద్వారా బాంబు హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి బయలుదేరి శంషాబాద్‌ చేరుకోవాల్సిన KU-373 విమానానికి బెదిరింపు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫ్లైట్‌ను మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.

READ MORE: Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!

ఇదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277 ఫ్లైట్‌కూ ఇదే తరహా మెయిల్ రావడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. పైలట్‌ పరిస్థితిని పర్యవేక్షించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణికులందరిని దిగదీసి అసోలేషన్‌ ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌ బృందాలు విమానాన్ని పూర్తిగా ఖాళీ చేసి అలర్ట్‌లో తనిఖీలు ప్రారంభించాయి. టర్మినల్‌ ప్రాంతంలో కూడా అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తూ అన్ని మూమెంట్స్‌ను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ఈ బెదిరింపు మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు సైబర్‌, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నా, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.

READ MORE: Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్

Exit mobile version