2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ మొదటగా బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో.. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ 43వ ఓవర్, 8వ ఓవర్లో వికెట్లు తీసి 200 వన్డే వికెట్లను పూర్తిచేశాడు. దీంతో.. అతను అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మహ్మద్ షమీ 5126 బంతుల్లో 200 వికెట్లు సాధించగా.. మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
Read Also: Tata Sierra SUV: ఆధునిక టెక్ & పవర్‌తో ఐకానిక్ SUV.. త్వరలో లాంచ్
మ్యాచ్‌ల పరంగా రికార్డు
మిచెల్ స్టార్క్ 102 వన్డే మ్యాచ్‌లలో 200 వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ 104 వన్డే మ్యాచ్‌లలో 200 వికెట్లు సాధించాడు. ఈ విధంగా స్టార్క్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో షమీ నిలిచాడు. కాగా.. ఈ రికార్డుతో మహ్మద్ షమీ భారత క్రికెట్‌లో మరో కొత్త ఘనత సాధించాడు. ఈ రికార్డుతో ప్రపంచ క్రికెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు.
అతి తక్కువ బంతుల్లో 200 వన్డే వికెట్లు తీసిన ఆటగాళ్లు
5126 మహమ్మద్ షమీ
5240 మిచెల్ స్టార్క్
5451 సక్లైన్ ముష్తాక్
5640 బ్రెట్ లీ
5783 ట్రెంట్ బౌల్ట్
5883 వకార్ యూనిస్
అతి తక్కువ మ్యాచ్‌లలో 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు
102 మిచెల్ స్టార్క్
104 మొహమ్మద్ షమీ
107 ట్రెంట్ బౌల్ట్
112 బ్రెట్ లీ
117 అల్లన్ డోనాల్డ్