Site icon NTV Telugu

INDvsAUS 2nd Test: ఖవాజా, హ్యాండ్స్‌కాంబ్ పోరాటం.. ఆసీస్ 263 ఆలౌట్

8

8

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలో 263 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యండ్స్‌కాంబ్ (72 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆసీస్‌కు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. కెప్టెన్ కమిన్స్ (33) కూడా కాసేపు క్రీజులో నిలబడ్డాడు. ఇక భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లతో రాణించగా.. జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.

Also Read: INDvsAUS 2nd Test: అశ్విన్, జడేజా సూపర్ రికార్డులు!

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు మంచి శుభారంభమే లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (15), ఉస్మాన్ ఖవాజా (81) మొదటి వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ అందించారు. అనంతరం కాసేపటికే వార్నర్‌ను షమీ ఔట్ చేశాడు. కాగా కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన లబుషేన్ (18)తో పాటు స్టీవ్ స్మిత్ (0)లను ఒకే ఓవర్లో పెవిలియన్ పంపిన అశ్విన్.. టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఖవాజా మాత్రం తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత.. రాహుల్ అందుకున్న సూపర్ క్యాచ్‌తో కాసేపటికే ట్రెవిస్ హెడ్ (12) కూడా వెనుదిరగడంతో 108 రన్స్‌కు ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

Also Read: KTR Twitter: మోడీ జీ.. అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా మీ మంత్రులందరికి ట్రెయినింగ్‌ ఇవ్వండి

అనంతరం, ఖవాజాతో కలిసిన హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్పిన్ బౌలింగ్‌లో ఇతడు సూపర్ బ్యాటింగ్ చేశాడు. క్రీజులో లోతుగా ఉంటూ బ్యాక్‌ఫుట్‌తో అదిరిపోయే షాట్స్ ఆడాడు. దీంతో మరో వికెట్ కోసం ఇండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన జడేజా సెంచరీ వైపు దూసుకెళ్తున్న ఖవాజాను ఔట్ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 75 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. అలెక్స్ కారే (0) విఫలమైనా కమిన్స్‌ (33) తో కలిసి హ్యాండ్స్‌కాంబ్ టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 59 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాక కమిన్స్‌, మర్ఫీ (0)ని ఒకే ఓవర్లో పెవిలియన్ పంపాడు జడేజా. లియోన్ (10) ఔటైనా కునేమన్‌ (6)తో కలిసి హ్యాండ్స్‌కాంబ్ చివరి వికెట్ పడకుండా కాసేపు అడ్డుకున్నాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జడేజా బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ ఔటైనా.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. కానీ తర్వాతి ఓవర్లోనే కునేమన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆసీస్ 263 రన్స్‌కు ఆలౌటైంది.

Also Read: Google Layoff: భారతదేశంలో గూగుల్ లేఆఫ్స్.. 450 ఉద్యోగుల తొలగింపు..

Exit mobile version