Site icon NTV Telugu

Shambala : ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో దూసుకుపోతోన్న ‘శంబాల’

Shambala

Shambala

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్, ఈసారి ‘శంబాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి నిదర్శనమే ఇప్పుడు ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్. సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 24నే ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీజర్, ట్రైలర్లతో క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ కారణంగా ఆడియెన్స్ ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

Also Read: Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!

ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. యగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ రేటుకు అమ్ముడవ్వడంతో నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉన్నారు. ఇక ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఆది కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version