టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంభాల: ఎ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఆర్చన అయ్యర్, స్వాసికా, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందుగా అనగా నిన్న రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు.
Also Read : Christmas release : డిసెంబర్ 25న రిలీజౌతున్న సినిమాలలో గెలుపెవరిది
1980ల నేపథ్యంలో ఒక చిన్న గ్రామం శంభాలలో అనూహ్య సంఘటనల నేపధ్యంతో, మైథాలజీ, విజ్ఞానం, సూపర్ నేచురల్ అంశాలతో రూపొందిన శంబాలా ఆకట్టుకుంది. యుగంధర్ ముని రాసుకున్న కథలో సస్పెన్స్, మిస్టిక్ మోమెంట్స్, పాత్రల భావోద్వేగలను స్క్రీన్ పై మలచడంలో సక్సెస్ అయ్యాడు. ఆది సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా విరామం తర్వాత ఆది ప్రదర్శన హైలైట్, కొన్ని ఆధ్యాత్మిక సన్నివేశాలు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సీన్స్ నెక్ట్స్ లెవల్. ఫ్లాష్‌బ్యాక్ స్టోరీటెల్లింగ్ ఎక్స్‌ట్రార్డినరీ చేసారూ, ఆపై ఉల్కా ఆస్టరాయిడ్ రివిలేషన్‌ను బాగుంది. మధుసూధన్ క్యారెక్టరైజేషన్ ఎమోషనల్ గా ఆకట్టుకుంది. శైలజ ప్రియ అద్భుతమైన నటనతో వణుకు పుట్టించింది. మీసాల లక్ష్మణ్ నటన తర్వాత శైలజ ప్రియా సీక్వెన్స్ కే ఎక్కువ భయమేసింది. ప్రీ క్లైమాక్స్ చిన్న పాప ఎమోషనల్ చేసిందిక్లైమాక్స్ ఆది ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ డైరెక్టర్ సూపర్ ప్రెజెంట్ చేసాడు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్స్. VFX బాగున్నాయి. ప్రాచీన పురాణాల సూత్రాలు, మైథాలజికల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన శంబాలా ఖచ్చితంగా మెప్పిస్తుంద. ఆది సాయికుమార్ శంబాలా సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడనే టాక్ ప్రీమియర్స్ నుండి వస్తుంది
