NTV Telugu Site icon

Shakib Al Hasan: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న బంగ్లా కెప్టెన్!

Shakib Al Hasan

Shakib Al Hasan

Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్‌ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో షకీబ్‌ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్‌ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షకీబ్‌ పోటీ చేస్తున్నాడు. అవామీ లీగ్‌ నుంచి షకీబ్‌కు టికెట్‌ కూడా ఖరారైంది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

అవామీ లీగ్ జాయింట్ సెక్రటరీ జనరల్ బహౌద్దీన్ నాసిమ్ బంగ్లాదేశ్‌లోని యువ తరంలో షకీబ్‌ అల్ హసన్‌కు ఉన్న భారీ ప్రజాదరణపై స్పందించారు. ‘షకీబ్‌ ఒక సెలబ్రిటీ. దేశ యువతలో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాడు. క్రికెట్ మాదిరి రాజకీయాల్లో కూడా రాణిస్తాడని నమ్మకం ఉంది’ అని నాసిమ్ పేర్కొన్నారు.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. సిరీస్‌పై భారత్‌ కన్ను! తిలక్‌కు చివరి అవకాశం

ప్రపంచకప్‌ 2023లో షకీబ్‌ అల్ హసన్‌ వేలికి గాయం కాగా.. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. షకీబ్‌ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లకు షకీబ్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. మూడు ఫార్మాట్‌లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన షకీబ్‌.. 14406 పరుగులు, 690 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా షకీబ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Show comments