Site icon NTV Telugu

Shaitaan : 50 కోట్లు మార్క్ దాటేసిన సైతాన్ మూవీ..3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

Whatsapp Image 2024 03 11 At 2.21.53 Pm

Whatsapp Image 2024 03 11 At 2.21.53 Pm

అజయ్ దేవగన్ , జ్యోతిక మరియు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సైతాన్ సినిమా భారతదేశంలో శుక్రవారం రూ. 14.75 నెట్‌ కలెక్షన్స్‌తో ఓపెనింగ్ చేసింది. తర్వాత రెండో రోజు అయిన శనివారం రూ. 18.75 కోట్లు వసూలు చేసింది.

ఇక మూడో రోజు ఆదివారం సైతాన్ సినిమా వసూళ్లు దాదాపు రూ. 20 కోట్లుగా అంచనా వేశారు. ఇలా మూడు రోజుల్లో కలిపి మొత్తంగా సైతాన్ సినిమాకు రూ. 53 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అలాగే, ఆదివారం నాడు సైతాన్ సినిమాకు హిందీలో మొత్తంగా 36.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించారు. సైతాన్ సినిమాకు అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్ మరియు అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరించారు. కృష్ణదేవ్ యాగ్నిక్ తెరకెక్కించిన గుజరాతీ మూవీ వాష్‌కు సైతాన్ మూవీ రీమేక్ గా వచ్చింది.సైతాన్ సినిమాలో జాంకీ బోడివాలకు జ్యోతిక తల్లి పాత్ర చేసింది. అలాగే అజయ్ దేవగన్‌కు భార్యగా నటించింది ఈ సినిమాలో ఆర్ మాధవన్ విలన్‌గా నటించాడు. అతీంద్రియ శక్తులు, వశీకరణం తదితర బ్లాక్ మ్యాజిక్ విషయాల్లో నిపుణుడుగా ఆర్ మాధవన్ నటన అదరగొట్టాడు.

Exit mobile version