Uttar Pradesh: మానవత్వం మచ్చుకు కూడా లేనట్లు ప్రవర్తించిన సంఘటన ఇది.. నిజంగా ఇది దారుణంగా ఉంటారా మనుషులు అనిపించేలా చేశారు. 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టిన సంచలన ఘటన యూపీలో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, కన్న ఆ కన్నతల్లి మనసు ఎలా అంగీకరించిది దీనికి.. సొంత బిడ్డను బతికి ఉండగానే పాతి పెట్టడానికి ఆ తండ్రి ఎలా ఒప్పుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Ustaad Bhagat Singh : పని ముగించిన పవన్ కళ్యాణ్
షాజహాన్‌పూర్ పరిధిలోని గోడాపూర్ గ్రామంలో ఆదివారం 15 రోజుల ఆడ శిశువును సజీవంగా పాతిపెట్టగా పోలీసులు సకాలంలో శిశివును రక్షించారు. ఈసందర్భంగా ఎస్పీ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ.. గ్రామంలోని కొన్ని చిన్న చెట్ల మధ్యలో సజీవంగా శిశువును పాటిపెట్టగా చిన్నారి చేయ్యి భూమి నుంచి పొడుచుకు రావడాన్ని ఒక గ్రామస్థుడు గమనించాడు. వెంటనే ఆయన అక్కడికి వెళ్లగా.. ఆ స్థలంలో శిశివు ఏడుపులు వినిపించాయని, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసు బృందం సకాలంలో చేరుకుని శిశువును రక్షించారని చెప్పారు. వాళ్లు అక్కడి వెళ్లి చిన్నారిని చూడగా ఊపిరి పీల్చుకుంటుండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వైద్య కళాశాలకు పంపించారని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం శిశువు పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. చిన్నారిని ఐసియులో ఉంచామని, ఆమె సంరక్షణ కోసం ప్రత్యేకంగా వైద్యుడిని కూడా నియమించినట్లు చెప్పారు. శిశువు వయస్సు దాదాపు 15 రోజులు ఉంటుందని అన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను కనిపెట్టడానికి, ఆమెను పాతిపెట్టడానికి కారణమైన వారిని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
READ ALSO: Aamir Khan: జాగ్రత్తగా ఉండటం అలవాటు.. అయినా రూ.200 కోట్లు నష్టం: ఆమిర్‌ఖాన్
