Shaheen Afridi:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ లో భారత్ క్రీడాస్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆరోపించాడు. తాజాగా లాహోర్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆతను.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో కనిపించిన పరిణామాలు “క్రీడా విలువలకు విరుద్ధంగా” ఉన్నాయని వ్యాఖ్యానించాడు.
ఇంకా షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. సరిహద్దు అవతలవైపు ఉన్నవారు క్రీడాస్ఫూర్తిని పాటించలేదని.. మా పని క్రికెట్ ఆడటమే, మేము మైదానంలోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అంటూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు 2026 టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి.
ఇకపోతే గత ఏడాది జరిగిన ఆసియా కప్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. మ్యాచ్‌ల అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షాక్ చేయడానికి భారత జట్టు నిరాకరించడం పెద్ద చర్చకు దారితీసింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మొదలైన ఈ వైఖరిని మిగతా ఆటగాళ్లూ అనుసరించడంతో టోర్నమెంట్ మొత్తం ఈ అంశం వివాదంగా కొనసాగింది.
Jana Nayagan : వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్
మరోవైపు కొంతమంది పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రవర్తన కూడా విమర్శలకు గురైంది. హారిస్ రౌఫ్ చేసిన “జెట్ క్రాష్” సెలబ్రేషన్, సాహిబ్జాదా ఫర్హాన్ తుపాకీ కాల్చినట్లు సంజ్ఞ చేయడం వంటి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఘటనలపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జరిమానాలు, హెచ్చరికలు విధించడంతో పరిస్థితి సద్దుమనిగింది. ఇప్పుడు తాజాగా షాహీన్ అఫ్రిది మాట్లాడిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో అతనిపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
