Site icon NTV Telugu

Pakistan: ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్‌కు భారీ దెబ్బ?

Pak

Pak

Pakistan: టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ దెబ్బ తగిలింది. బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న సమయంలో షాహీన్ అఫ్రిదీ గాయంతో మైదానం విడిచిపెట్టాడు. డిసెంబర్ 15న బిగ్ బాష్ లీగ్‌లో తన కెరీర్‌ను పునఃప్రారంభించిన రోజే షాహీన్ అఫ్రిదికి కలిసి రాలేదు. సైమండ్స్ స్టేడియంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన అఫ్రిదీ ప్రమాదకర బౌలింగ్ కారణంగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో అఫ్రిదీ వేసిన రెండు బంతులు నడుము ఎత్తులో ఫుల్‌టాస్‌గా వెళ్లాయి. ఒకటి టిమ్ సీఫర్ట్‌కు, మరొకటి ఒల్లి పీక్‌కు పడింది. ఈ బౌలింగ్‌ను ప్రమాదకరంగా భావించిన అంపైర్లు అఫ్రిదీ బౌలింగ్ ఆపాలని ఆదేశించారు. దీంతో ఆ ఓవర్‌లో మిగిలిన రెండు బంతులను హీట్ కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ పూర్తి చేశాడు.

READ MORE: Tragedy: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి

మైదానం నుంచి బయటకు వెళ్లేటప్పుడు అఫ్రిదీ కాస్త నిరాశతో చిరునవ్వు నవ్వాడు. అఫ్రిదీ తొలి స్పెల్ 2.4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకుండానే ముగిసింది. ఆ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు నోబాల్స్ ఉండగా, రెండు వైడ్స్ కూడా ఉన్నాయి. బిగ్ బాష్ లీగ్‌లో షాహీన్ అఫ్రిదీపై భారీ అంచనాలు ఉన్నాయి. అతనితో పాటు పాకిస్థాన్ జట్టు ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ కూడా ఈ మ్యాచ్‌తోనే రెనిగేడ్స్ తరఫున టోర్నీలో అరంగేట్రం చేశాడు. కానీ ఇద్దరూ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయారు. టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో పాకిస్థాన్ జట్టుకు ఇది పెద్ద మైనస్‌గా మారనుంది.

Exit mobile version